Patancheru: వెలిమెలలో రూ.30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Patancheru: పటాన్‌చెరు నియోజకవర్గం వెలిమల గ్రామంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2026 1:47 PM IST
Patancheru
X

Patancheru: వెలిమెలలో రూ.30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమల గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు మరియు వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముత్తంగి డివిజన్ పరిధిలోని విలీన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

హాజరైన పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ కావ్య, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డిఈ కృష్ణవేణి, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, కొమరయ్య, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్