Patancheru: అమీన్పూర్లో దుర్గామాత నిమజ్జనం పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Patancheru: అమీన్పూర్లో దుర్గామాత శోభాయాత్ర, నిమజ్జనంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు చల్లగా ఉండాలని ఆకాంక్ష.
Patancheru: అమీన్పూర్లో దుర్గామాత నిమజ్జనం పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ కేంద్రంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, దుర్గామాత ఆరాధన శక్తి, ధైర్యం, ధర్మానికి నిదర్శనమని పేర్కొన్నారు. శరన్నవరాత్రులు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలు ప్రతిబింబాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, భక్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.




