Patancheru: నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

Patancheru: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు నిరుపేద బాధితులకు రూ. 5 లక్షల విలువైన సీఎం సహాయ నిధి ఎల్ఓసీ పత్రాలను అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Oct 2026 8:28 PM IST
Patancheru
X

Patancheru: నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

పటాన్చెరు: ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పిఎన్ఆర్ కాలనీకి కరుణా శ్రీ, పటాన్చెరు డివిజన్ అంబేద్కర్ కాలనీకి చెందిన బయగళ్ల ప్రతాప్ లు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి రెండు లక్షల 50 వేల రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, శ్రీ రాములు, బలవంత్, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్