Patancheru: పటాన్‌చెరులో ఘనంగా మహా చండీయాగం, అన్నప్రసాద వితరణ
Patancheru: పటాన్‌చెరు శాంతినగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతుల ఆధ్వర్యంలో మహా చండీయాగం నిర్వహించారు.
Patancheru: పటాన్‌చెరులో ఘనంగా మహా చండీయాగం, అన్నప్రసాద వితరణ
పటాన్ చెరువు: పటాన్ చెరువు శ్రీ నగర శాంతి నగర్ కాలనీలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కార్తీక మాస శనివారం పురస్కరించుకొని ఉదయం విశేష పాంచామృతం విశేష సింధు వర్ణంతో ప్రత్యేక దర్శనమిస్తున్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి అనంతరం మహా చండీయాగంలో పూర్ణాహుతిలో పాల్గొన్న పఠాన్ చేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు మరియు 25 మంది దంపతులచే అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి సింధూర పూజ, చండీయాగం లక్ష్మీ గణపతి హోమం అనంతరం సుమారు 200 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇరువురు మాట్లాడుతూ కార్తీక మాస శనివారం సందర్భంగా నందిగామ మాజీ సర్పంచ్ పటాన్ చేరు మార్కెట్ కమిటీ చైర్మన్ దంపతులచే మహా చండి యాగాన్ని మరియు అన్న ప్రసాద వితరణను నిర్వహించడం జరిగింది వీరికి ఆలయ కమిటీ తరఫున ఘనంగా స్వాగతం పలుకుతూ ఈ దంపతులచే
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామికి సింధూర అర్చన పంచామృతల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.




