Patancheru: అమ్మవారి మండపాల్లో మాద్రి పృథ్వీరాజ్ పూజలు
Patancheru: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పటాన్చెరులోని శ్రీరామ్ నగర్, శివాలయం అమ్మవారి మండపాలను బీఆర్ఎస్ నేత మాద్రి పృథ్వీరాజ్ సందర్శించి పూజలు చేశారు.
Patancheru: అమ్మవారి మండపాల్లో మాద్రి పృథ్వీరాజ్ పూజలు
పటాన్చెరు: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని శ్రీరామ్ నగర్, శివాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, MDR ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.




