Patancheru: పాశమైలారంలో ఘనంగా రావణ దహనం, శమీ పూజ

Patancheru: పటాన్‌చెరు పాశమైలారంలో ఘనంగా రావణ దహనం, శమీ పూజ. హాజరైన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Oct 2026 4:49 PM IST
Patancheru
X

Patancheru: పాశమైలారంలో ఘనంగా రావణ దహనం, శమీ పూజ

పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశ మైలారం వార్డులో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అలనాటి సంప్రదాయాన్ని చాటిచెప్పారు.

పూజా కార్యక్రమాల అనంతరం గ్రామంలో రావణ దహన కార్యక్రమం వైభవంగా చేపట్టారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ రావణ దహన వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, మహిళలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా సుధాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దుర్గ భవాని మాత గ్రామ ప్రజలపై ఆశీర్వాదం ఉండాలని సుఖశాంతుల అష్టైశ్వర్యాలతో ఈ రావణ దహన కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరిత సుధాకర్ గౌడ్, సాయి గౌడ్ మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్