Patancheru: MDR ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు!
Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు MDR ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా దీపావళి లక్ష్మీ పూజ. పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాద్రి దేవేందర్ రెడ్డి, పృథ్వీరాజ్.
Patancheru: MDR ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు!
Patancheru: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలోని MDR ఫౌండేషన్ కార్యాలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ, ఆనందం, ప్రేమ, ఐకమత్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, సురక్షితంగా దీపావళి వేడుకలను జరుపుకోవాలని కోరారు.
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షల తెలియజేశారు.




