Patancheru: జెకె ఫెన్నార్ కార్మిక సంఘం ఎన్నికల్లో బిఆర్టియు ఘన విజయం

Patancheru: పటాన్‌చెరు డివిజన్ జెకె ఫెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నికల్లో 13 ఓట్ల తేడాతో విజయం సాధించిన బిఆర్టియు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 6:28 PM IST
Patancheru
X

Patancheru: జెకె ఫెన్నార్ కార్మిక సంఘం ఎన్నికల్లో బిఆర్టియు ఘన విజయం

పటాన్చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెకె ఫెన్నార్ పరిశ్రమలో గురువారం నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బి ఆర్ టి యు విజయ దుందుభి మోగించింది. సమీప ప్రత్యర్థి యూనియన్ హెచ్ఎంఎస్ పై 13 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. మొత్తం 247 ఓట్లలో.. బిఆర్టియు కి 103, హెచ్ఎంఎస్ కి 93, సిఐటియుకి 48 ఓట్లు రాగా.. మూడు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ లు మాట్లాడుతూ... అనునిత్యం.. అనుక్షణం కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బి ఆర్ టి యు గెలుపులో భాగస్వామ్యం ప్రతీ కార్మికుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ల సహాయ సహకారాలతో, మార్గదర్శకత్వంలో ప్రతి కార్మికుడికి మెరుగైన వేతన ఒప్పందం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అధ్యక్షులుగా రాంబాబు యాదవ్, ప్రధాన కార్యనిర్వహక అధ్యక్షులుగా యాదగిరి యాదవ్ లు ఎన్నికయ్యారు. సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు..

జెకె ఫెన్నార్ పరిశ్రమలో భారీ విజయం సాధించిన అనంతరం బి ఆర్ టి యు నాయకులు, కార్మికులు పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. బి ఆర్ టి యు విజయానికి నాయకులైన ప్రతి కార్మికుడికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కొత్త కార్యవర్గంపై ఉందని అన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం అత్యంత విలువైనదని అన్నారు. కార్మికులకు అభినందనలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్