Toopran: వెంకటాయిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయిపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ హరీష్ గౌడ్ ప్రారంభించి, రైతులు దళారులను నమ్మవద్దని సూచించారు.
Toopran: వెంకటాయిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం వెంకటాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ హరీష్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ హరీష్ గౌడ్ మాట్లాడుతూ... రైతులు మధ్య దళారులకు అమ్మకుండా ప్రభుత్వ ఐకేపీ సెంటర్లలోనే వడ్లు అమ్ముకోవాలని కోరారు. దళారుల వద్ద తూకంలో మోసం జరిగే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీఏ కృష్ణవేణి గ్రామ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.




