Patancheru: చిట్కుల్‌లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి': నీలం మధు

Patancheru: పటాన్‌చెరు నియోజకవర్గం చిట్కుల్‌లో ఇందిరమ్మ లబ్ధిదారురాలు నాగమణి ఇంట్లో నీలం మధు ముదిరాజ్ దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Nov 2026 9:14 PM IST
Patancheru
X

Patancheru: చిట్కుల్‌లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి': నీలం మధు

సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

ఆదివారం దీపావళి సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తన స్వగ్రామం చిట్కుల్ 4 వ వార్డులో గౌండ్ల నాగమణి కి మంజూరు అయిన ఇందిరమ్మ ఇoట్లో నిర్వహించిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారితో కలిసి కొత్త ఇంటిలో దీపాలు వెలిగించి టపాసులు కాల్చి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాగమణి కుటుంబానికి నూతన వస్త్రాలు పెట్టి, మిఠాయిలు తినిపించి టపాసులు కాల్చిన నీలం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సొంతింటి కల నెరవేరుతుందో లేదోనని ఎదురుచూసిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త ఆశలు కల్పించిందన్నారు. పేద కుటుంబం కొత్త ఇంటిలో దీపాలు వెలిగిస్తూ దీపావళి జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి నిదర్శనం అని కొనియాడారు.

ఈ పథకం అమలుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఈ ఏడాది తమ కుటుంబానికి దీపావళి మరింత ప్రత్యేకమైందని నాగమణి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నీలం మధు ముదిరాజ్ ఈ సందర్బంగా నాగమణి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమీషనర్ వెంకట కిషన్, కౌన్సిలర్స్ నీలం కవిత ముదిరాజ్, సంగన్నగారి జ్యోతిగోపాల్, సంతోషదస్తగిరి, మన్నే రాఘవేంద్ర, సంపత్ రెడ్డి, నారాయణదాసు, మణికంఠ, సందీప్ గౌడ్, నాయకులు నారాయణ రెడ్డి, లక్దారం మల్లేష్, ముత్తంగి అశోక్, అజ్జు, సుంకరి యాదయ్య, ముత్యాలు, శ్రీను, విష్ణు, శ్రీను అప్పా, సంగన్నగారి శ్రీను, ప్రవీణ్, రంజిత్, గ్రామస్థులు, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్