Medak: మెదక్‌లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు!

Medak: మెదక్‌లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

NAGARAJ, MEDAK
Published on: 11 Nov 2026 1:27 PM IST
Medak
X

Medak: మెదక్‌లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు!

Medak: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సహాబ్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని మెదక్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మిల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెదక్ పాత బస్టాండ్ వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ సహాబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కనుగు రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్.మిల్లీ అసోసియేషన్ అధ్యక్షుడు. ఉమర్ ఖాన్. ప్రధాన కార్యదర్శి. డాక్టర్ సుఫి బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధికా భూపతి రాజు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ సహాబ్. రచనలు దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో. దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మౌలానా జీవిత చరిత్రను చదువుకోవాలని ఆయన ఆశయం ఈ దేశంలో సమానత్వం విద్యా వ్యాప్తి ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఉండే వారని అయినా అన్నారు.

ఆయన తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టండి తెలిపారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మెదక్ మిల్లీ అసోసియేషన్ సభ్యులు, కౌన్సిలర్ లు సోహెల్ జుబేర్ ఆంజనేయులు దీపక్ కుమార్ మైనార్టీ నాయకులు మన్సూర్ మౌలానా జావిద్ సమియోద్దీన్ గఫూర్ మౌలానా జాకీ తోపాటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్. భారత రాష్ట్ర సమితి లో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ పట్టణ కార్యదర్శి కృష్ణ గౌడ్ విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK