Narsapur: నర్సాపూర్‌లో తప్పిపోయిన రెండేళ్ల బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులు!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో తప్పిపోయిన రెండేళ్ల బాలుడిని కేవలం రెండు గంటల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. ప్రశంసిస్తున్న స్థానికులు.
Narsapur: నర్సాపూర్‌లో తప్పిపోయిన రెండేళ్ల బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులు!
Narsapur: ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తప్పిపోయిన రెండేళ్ల బాలుడిని నర్సాపూర్ పోలీసులు కేవలం రెండు గంటల్లోనే గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల తక్షణ స్పందనతో బాలుడి కుటుంబంలో ఆందోళన తొలగిపోయింది.
నర్సాపూర్ పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో బాలుడు ఒంటరిగా ఏడుస్తూ కనిపించడంతో విధుల్లో ఉన్న బ్లూ కొల్ట్స్ సిబ్బంది మోహన్, సతీష్ వెంటనే స్పందించారు. బాలుడిని నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
అక్కడ WPCలు శోభ, కవిత బాలుడి సంరక్షణ బాధ్యతలు చేపట్టి, అవసరమైన ఆహారం అందిస్తూ జాగ్రత్తగా చూసుకున్నారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ si రంజిత్ రెడ్డి వెంటనే సిబ్బందితో కలిసి బాలుడు కనిపించిన ప్రాంతానికి చేరుకున్నారు.
కాలనీలో సుమారు రెండు గంటల పాటు ప్రతి ఇంటిలో విచారణ చేపట్టి బాలుడి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో బాలుడు ఆర్యన్ (2 సంవత్సరాల 9 నెలలుగా) గుర్తించారు. అతడి తల్లిదండ్రులు రామ్ గణేష్–రాణి దంపతులని, వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని, ప్రస్తుతం శ్రీరామ్‌నగర్ కాలనీలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తగిన ఆధారాలతో తల్లిదండ్రులను నిర్ధారించిన అనంతరం బాలుడిని క్షేమంగా వారికి అప్పగించారు. ప్రతిరోజూ మేస్త్రీ పనికి వెళ్లే రామ్ గణేష్, ఆ సమయంలో బాలుడిని అదే కాలనీలో సుమారు 200 మీటర్ల దూరంలో నివసించే తన అత్త రాం కళీ వద్ద ఉంచి వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
బాలుడి ఆచూకీని వేగంగా గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కొల్ట్స్ సిబ్బంది మోహన్, సతీష్, WPCలు కవిత, శోభలను si రంజిత్ రెడ్డి అభినందించారు.తమ కుమారుడిని క్షేమంగా తిరిగి అప్పగించినందుకు రామ్ గణేష్–రాణి దంపతులు నర్సాపూర్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తక్షణ స్పందన, చొరవను అభినందించారు. “ప్రజల భద్రతే మా బాధ్యత – ప్రతి చిన్నారి క్షేమమే మా కర్తవ్యం” అని నర్సాపూర్ si రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.




