Narsapur: రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు నర్సాపూర్ పోలీసులు!
Narsapur: నర్సాపూర్ ఎన్హెచ్-765డిపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రంజిత్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనల వివరాలు.
Narsapur: రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు నర్సాపూర్ పోలీసులు!
Narsapur: నర్సాపూర్ పట్టణ ప్రజలకు, వాహనదారులకు నర్సాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. జాతీయ రహదారి NH-765Dపై కొంతమంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ సైడ్లో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా, ఎదురుగా వచ్చే ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని పోలీసులు హెచ్చరించారు. ఇకపై నర్సాపూర్ పట్టణ పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్కు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు.
వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలు ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే ప్రయాణించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచికలను తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. వాహనం నడుపుతున్నప్పుడు సెల్ఫోన్ ఉపయోగించకూడదు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని నర్సాపూర్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది.. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి! రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ si రంజిత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.




