Narsapur: నర్సాపూర్‌లో మిషన్ భగీరథ పైప్ లీకేజీ – రోడ్డుపై భారీగా నీటి ప్రవాహం
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకై రోడ్డుపైకి భారీగా నీరు చేరింది. విద్యుత్ స్తంభాల వద్ద నీరు చేరడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
Narsapur: నర్సాపూర్‌లో మిషన్ భగీరథ పైప్ లీకేజీ – రోడ్డుపై భారీగా నీటి ప్రవాహం
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో రహదారిపైకి భారీగా నీరు చేరింది. సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి పక్కన, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం ఎదుట పైప్‌లైన్ లీకేజీ ఏర్పడటంతో నీరు పెద్దఎత్తున రోడ్డుపై ప్రవహిస్తోంది.
ఇదే ప్రాంతంలో గతంలోనూ పైప్‌లైన్ లీకేజీ చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా మరోసారి లీకేజీ ఏర్పడటంతో రహదారిపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారిపై నీటి ప్రవాహం కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు లీకేజీ నుంచి వచ్చిన నీరు విద్యుత్ స్తంభాల వైపు కూడా చేరడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ స్తంభాల సమీపంలో పెద్ద శబ్దం వినిపించడంతో ప్రమాదం జరుగుతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీని వెంటనే అరికట్టడంతో పాటు, తరచూ ఇదే ప్రాంతంలో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




