Narsapur: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై బీజేపీ జిల్లా చీఫ్ మల్లేష్ ఫైర్
Narsapur: నర్సాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వైఖరిపై మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Narsapur: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై బీజేపీ జిల్లా చీఫ్ మల్లేష్ ఫైర్
నర్సాపూర్ మెదక్ జిల్లా: మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ అసెంబ్లీ బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై మల్లేష్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా వల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని సూచించారు.
మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులుగా ఉన్న కేసీఆర్, హరీష్‌రావులు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని మల్లేష్ గౌడ్ ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వైఖరిని బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరఫున ఖండిస్తున్నట్లు వల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు.
ఈ మీడియా సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, నారాయణ రెడ్డి, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల, మండల అధ్యక్షులు నీలి నగేష్, రవి, నర్సాపూర్ పట్టణ కన్వీనర్ ప్రేమ్, జిల్లా మోర్చా నాయకులు నగేష్ గౌడ్, నర్సారెడ్డి, బీజేపీ నాయకులు షాదుల్లా, నర్సయ్య, చంద్ర మోహన్ రెడ్డి, యాదగిరి చారి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.




