Narsapur: ఓల్డ్ ఏజ్ హోమ్‌‌ను సందర్శించిన లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు

Narsapur: నర్సాపూర్‌లోని విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్‌ను లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు సందర్శించారు. వృద్ధులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

G Ashok Reddy, Narsapur
Published on: 30 Sept 2026 5:57 PM IST
Narsapur
X

Narsapur: ఓల్డ్ ఏజ్ హోమ్‌‌ను సందర్శించిన లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు

నర్సాపూర్: వృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణపై మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లోని విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్‌ను సందర్శించారు.

మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ చైర్మన్ ఎం. హేమలత ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్, లీగల్ సర్వీస్ సిబ్బందితో కలిసి వృద్ధులను కలిశారు. ఈ సందర్భంగా వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్యం, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

చట్టపరమైన సమస్యలపై న్యాయ సహాయం

ఈ సందర్భంగా న్యాయవాది రాజు నాయక్ మాట్లాడుతూ.. వృద్ధులు ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో జీవించాలని సూచించారు. వృద్ధులకు ఏవైనా చట్టపరమైన సమస్యలు ఎదురైతే సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.

వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులకు సూచించారు. సమస్యలు లేదా ఆటంకాలు ఎదురైతే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ, నర్సాపూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు

వృద్ధులకు చట్టబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని న్యాయవాది సూచించారు. వృద్ధుల హక్కులు, వారి సంక్షేమం విషయంలో అవసరమైన సహకారం అందించేందుకు లీగల్ సర్వీసెస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ సిబ్బంది సుభాష్, శ్రీనివాస్, విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur