Narsapur: రైతు కుటుంబానికి అండగా దండే అపర్ణ ఆర్థిక సాయం అందజేత!
Narsapur: పాంబండ శంకర్ నాయక్ తండాలో రైతు మాలోత్ శంకర్ కుటుంబాన్ని తెరాస నేత దండే అపర్ణ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్.
Narsapur: రైతు కుటుంబానికి అండగా దండే అపర్ణ ఆర్థిక సాయం అందజేత!
నర్సాపూర్: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ గ్రామ పరిధిలోని శంకర్ నాయక్ తండాకు చెందిన యువ రైతు మాలోత్ శంకర్ (45) మృతి ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయి, అప్పుల భారం పెరగడంతో మనస్తాపానికి గురైన శంకర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనపై సమాచారం తెలుసుకున్న తెరాస (తెలంగాణ రక్షణ సేన) నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షురాలు దండే అపర్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వెంటనే శంకర్ నాయక్ తండాలోని మాలోత్ శంకర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి బాధలో పాలుపంచుకున్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించారు. రైతు కుటుంబానికి భరోసా కల్పించిన దండే అపర్ణను స్థానికులు అభినందించారు.
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: దండే అపర్ణ
ఈ సందర్భంగా దండే అపర్ణ మాట్లాడుతూ.. రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమైన నీరు, విద్యుత్ సకాలంలో అందకపోవడం, పంటలు ఎండిపోవడం, అప్పుల భారం పెరగడం వంటి సమస్యలు రైతు కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాలోత్ శంకర్ మృతి ఘటనకు ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ, రైతుల కష్టాలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి వారికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు ఆర్థికంగా ఆదుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.
కష్టాల్లో ఉన్న రైతు కుటుంబానికి అండగా నిలిచిన దండే అపర్ణ
రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, విషాదంలో ఉన్న రైతు కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించడం, వారికి ధైర్యం చెప్పడం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా దండే అపర్ణ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ, రైతుల సమస్యలపై ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నర్సాపూర్ అసెంబ్లీ తొలి శాసనసభ్యుడు గుండం వీరయ్య గారి మనవరాలైన దండే అపర్ణ, రైతు కుటుంబానికి అండగా నిలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైతు కుటుంబానికి న్యాయం చేయాలి.. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని కోరారు...




