Narsapur: జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్‌లో బుర్ర శ్రీనిధికి ప్రథమ బహుమతి
Narsapur: జిల్లా స్థాయి చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌లో నర్సాపూర్ విద్యార్థిని బుర్ర శ్రీనిధికి ప్రథమ బహుమతి. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై హర్షం.
Narsapur: జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్‌లో బుర్ర శ్రీనిధికి ప్రథమ బహుమతి
నర్సాపూర్: ప్రతిభకు పట్టుదల తోడైతే విజయాలు సొంతమవుతాయని నిరూపించింది నర్సాపూర్‌కు చెందిన విద్యార్థిని బుర్ర శ్రీనిధి. జిల్లా స్థాయిలో నిర్వహించిన నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ (NCSE – National Children's Science Congress) పోటీల్లో తన ప్రతిభను చాటుకొని ప్రథమ బహుమతి సాధించింది. అంతేకాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నర్సాపూర్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
స్థానిక వనరులతో భూక్షయాన్ని అరికట్టడం అనే అంశంపై శ్రీనిధి రూపొందించిన సైన్స్ ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి నేల కోతను ఎలా నివారించవచ్చనే అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరించడం ఆమె ప్రాజెక్ట్ ప్రత్యేకతగా నిలిచింది.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సైన్స్ ఇన్‌చార్జి రజిరెడ్డి తదితరుల పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో శ్రీనిధి ప్రతిభకు ప్రథమ బహుమతి దక్కింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపూర్‌కు చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతో శ్రీనిధి ఈ విజయాన్ని సాధించింది.
మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బుర్ర శ్రీనిధి తల్లిదండ్రులు స్వప్న, సత్యం గౌడ్‌లు తమ కుమార్తె సాధించిన విజయంపై అలాగే మెదక్ జిల్లా కి పేరు తేవడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలోనూ శ్రీనిధి మరిన్ని విజయాలు సాధించాలని ఉపాధ్యాయులు, స్థానికులు ఆకాంక్షిస్తున్నారు...




