Patancheru: ప్రాచీన్ గ్లోబల్ ఆసుపత్రిని ప్రారంభించిన MLA మహిపాల్ రెడ్డి

Patancheru: పటాన్‌చెరులో ప్రాచీన్ గ్లోబల్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలని సూచన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 Oct 2026 5:10 PM IST
Patancheru
X

Patancheru: ప్రాచీన్ గ్లోబల్ ఆసుపత్రిని ప్రారంభించిన MLA మహిపాల్ రెడ్డి

పటాన్చెరు: పటాన్చెరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో మరిన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

శనివారం పటాన్చెరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాచీన్ గ్లోబల్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై..ఆసుపత్రిని ప్రారంభించి, అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధునిక వైద్య సదుపాయాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు పారిశ్రామికంగా, జనాభా పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. వైద్య సేవలు కేవలం ఆర్థిక స్థోమత కలిగిన వారికే పరిమితం కాకుండా పేదలకు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు.

ఆసుపత్రి యాజమాన్యం నాణ్యమైన వైద్య సేవలతో పాటు పేదలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వెంకట్ ఆలపాటి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, పృథ్వీరాజ్, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్