Patancheru: అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ వద్ద బీఆర్టీయూ జెండా ఆవిష్కరణ!
Patancheru: పటాన్చెరు అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్టీయూ జెండా ఆవిష్కరించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
Patancheru: అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ వద్ద బీఆర్టీయూ జెండా ఆవిష్కరణ!
Patancheru: పటాన్చెరు పరిధిలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసన సభ్యులు, అగర్వాల్ రబ్బర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
సోమవారం అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ ఎదుట ఏర్పాటు చేసిన బిఆర్టియు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి.. ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై.. జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరిశ్రమ ఎండి అమిత్ అగర్వాల్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మిక నేపథ్యం నుండి రాజకీయాల్లోకి వచ్చిన తనకు ప్రతి కార్మికుడి కష్ట నష్టాలు తనకు తెలుసునని అన్నారు. అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి చట్టపరంగా రావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు.. ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు సైతం అందిస్తామని తెలిపారు. పరిశ్రమ అభివృద్ధిలోనూ కార్మికులు కీలక పాత్ర పోషించాలని కోరారు. విధి నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తిన.. తన దృష్టికి తీసుకొని రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి, అగర్వాల్ రబ్బర్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి యాదవ్, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కార్మిక నాయకులు మధుసూదన్ రావు, అశోక్ రాజ్, సత్తయ్య, ఏడుకొండలు, ధర్మ రావు, కమృద్దీన్, విజయ్ కుమార్, పాణిగ్రాహి, రాజు, సింగ్, నరసింహ, శివ కుమార్, రవి, బాల రాజేష్, మల్లేష్, పాండా, రాజేంద్ర, నాగరాజు, సాహు, సంజీవ్, రమణ, తదితరులు పాల్గొన్నారు.




