Sangareddy: కేటీఆర్‌ను కలిసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి!

Sangareddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 11:57 AM IST
Sangareddy
X

Sangareddy: కేటీఆర్‌ను కలిసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి!

Sangareddy: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని సోమవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేటీఆర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఆహ్వానించారు. అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్