Patancheru: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సిఎంసి కార్యాలయం ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2026 11:50 AM IST
Patancheru
X

Patancheru: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Patancheru: దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సిఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. పోలియో రహిత దేశంగా మార్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, వైద్యులు పట్లోల మనోహర్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్