Sadasivpet: సదాశివపేటలో 50 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Sadasivpet: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా 50 మందికి రూ.13.13 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు ఆర్థిక ఊరట.
Sadasivpet: సదాశివపేటలో 50 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Sadasivpet: సదాశివపేట మండలానికి చెందిన 28 మంది, సదాశివపేట పట్టణానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు మొత్తం 50 సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం రూ.13,13,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎం రిలీఫ్ ఫండ్ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల, పట్టణ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, చిల మల్లన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, మైనార్టీ అధ్యక్షుడు కామేల్, తదితరులు పాల్గొన్నారు.




