Medak: తూప్రాన్ పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా ఉమ్మాన్నగారి భాస్కర్ రెడ్డి ప్రమాణం!

Medak: తూప్రాన్ పీఏసీఎస్ నూతన చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరగాలని డిమాండ్.

RAJU,TOOPRAN
Published on: 16 Oct 2026 6:51 PM IST
Medak
X

Medak: తూప్రాన్ పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా ఉమ్మాన్నగారి భాస్కర్ రెడ్డి ప్రమాణం!

Medak: మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ ఉమ్మాన్నగారి భాస్కర్ రెడ్డి పాలక వర్గం ప్రమాణ స్వకారం కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే మనందరి లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లాలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేవలం 12 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రమే కట్టారని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 12 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టించామని తెలిపారు.

కేసీఆర్ ఆస్తులపై విచారణ అవసరం:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ ఆస్తులపై మాట్లాడారని గుర్తు చేశారు. ఉద్యమం ముందు కేసీఆర్ కు 22 ఎకరాలు ఉండేవని, ఉద్యమ సమయంలో 42 ఎకరాలు కొన్నారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన పదేళ్లలో 330 ఎకరాల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తులు ఎలా పెరిగాయో అసెంబ్లీలోనే చెప్పడం జరిగిందని మంత్రి వివేక్ పేర్కొన్నారు.

గజ్వేల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం - మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేటలో 10 ఏళ్లలో 12 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లే - రెండేళ్లలో 12 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టాం - మంత్రి వివేక్_

కేసీఆర్ ప్రభుత్వం లో పెద్ద ప్రాజెక్టు లు కమిషన్ ల కోసం చేసినవే అన్నారు మాల్లన సాగర్ సిద్దిపేట లో ఆసుపత్రి లో భారీ కమిషన్ లు ముట్టయి అని అయన దుయ్యబెట్టారు

కేసీఆర్ ఆస్తులపై విచారణ జరగాలి ఉద్యమం ముందు 22 ఎకరాలు, సీఎం అయ్యాక 330 ఎకరాలు ఎక్కడివి - మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు సూసైటీ వైస్ చైర్మన్ గా నర్సింలు పాలక వర్గం సభ్యులు గా కొక్కొండ శేషి భూషణ్ రెడ్డి. ధర్మేందర్ రెడ్డి తిరుపతి రెడ్డి కిష్టారెడ్డి అనిల్ కుమార్ రాంచందర్ రెడ్డి తిరుపతి దుర్గమ్మ బాలమణి లను ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి ఈ కార్యక్రమం లో మాజీ రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చిట్కూల్ మైపాల్ రెడ్డి తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు N శ్రీనివాస్ రెడ్డి తూప్రాన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిగే నర్సింగరావు మనోహరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లారెడ్డి కావేరి గారి వెంకట్ రెడ్డి వెంకటేష్ యాదవ్ కాళ్ళకల్ సర్పంచ్ నవ్య నాగరాజు గౌడ్ వర్గాంటి గౌతమ్ గౌడ్ వీరు కుమార్ యాదవ్ వెంకటేశం గుప్త ఉమర్ అనిల్ హాజర్ రాజు యాదవ్ గోపి తదితరులు పాల్గొన్నారు

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN