Andole: అందోల్‌లో MGR ఫంక్షన్ హాల్ నూతనంగా ప్రారంభం!

Andole: అందోల్ గ్రామంలో నూతనంగా MGR ఫంక్షన్ హాల్ ప్రారంభం. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లోనే సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకుల వెల్లడి.

UMASHANKAR, ANDOLE
Published on: 11 Oct 2026 7:06 PM IST
Andole
X

Andole: అందోల్‌లో MGR ఫంక్షన్ హాల్ నూతనంగా ప్రారంభం!

Andole: సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలోని క్యాంపు కార్యాలయం ఎదురుగా నూతనంగా MGR ఫంక్షన్ హాల్ ప్రారంభమైంది.. ఈ ఫంక్షన్ హాల్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అందుబాటు ధరల్లోనే అన్ని సకల సౌకర్యాలతో ఈ ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఓమర్ ఫరూక్,అక్బర్ భాయ్, మెహతాబ్ ఖలీల్ మాట్లాడుతూ, “ప్రతి కుటుంబం తమ శుభకార్యాలను ఆర్థిక భారం లేకుండా ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో MGR ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించాం అని తెలిపారు.. వివాహాలు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అన్ని వేడుకలకు తగిన సదుపాయాలతో, పరిశుభ్రమైన వాతావరణంలో, తక్కువ ధరల్లో సేవలు అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి అందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE