Patancheru: పటాన్‌చెరు జెపి కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన మెట్టు కుమార్ యాదవ్!

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జెపి కాలనీ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటన. రోడ్ నంబర్ 4లో డ్రైనేజీ సమస్యపై అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించిన వైనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Nov 2026 1:40 PM IST
Patancheru
X

Patancheru: పటాన్‌చెరు జెపి కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన మెట్టు కుమార్ యాదవ్!

Patancheru: పటాన్ చేరు జెపి కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఈరోజు ఉదయం పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జెపి కాలనీ రోడ్ నంబర్ 4లో డ్రైనేజీ సమస్య ఉందని స్థానిక కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిశీలించిన మెట్టు కుమార్ యాదవ్ HMWS&SB AE ప్రేమ్ కుమార్ ని ఫోన్ చేసి పిలిపించి సమస్యను వివరించడం జరిగింది.

డ్రైనేజీ లైనులో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, మురుగునీరు రోడ్లపైకి చేరుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన ప్రేమ్ కుమార్ గారు సంబంధిత GHMC పారిశుద్ధ్య సిబ్బందిని పురమాయించి తక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కాలనీలలో పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించాలని, సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.

ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో HMWS&SB అధికారులు, GHMC సిబ్బంది, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్