Veldurthi: వెల్దుర్తిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం

Veldurthi: మెదక్ జిల్లా వెల్దుర్తి మహాలక్ష్మి ఆసుపత్రిలో మెగా ఉచిత హెల్త్ క్యాంప్. 500 మందికి ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ.

RAJU,TOOPRAN
Published on: 31 Oct 2026 5:53 PM IST
Veldurthi
X

Veldurthi: వెల్దుర్తిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం

వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తిలోని మహాలక్ష్మి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీమేరు 100 పడకల సూపర్ స్పెషల్టీ ఆసుపత్రి గుండ్ల పోచంపల్లి వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో ఆర్థో. గైనిక్ జనరల్ డాక్టర్ల చే పరీక్షలు చేశారు గ్రామ సర్పంచ్ పాలక వర్గ సభ్యులు యువత ప్రముఖ పాల్గొన్నారు.

మండలంలోని వివిధ గ్రామాల నుండి 500 మంది వృద్ధులు, మహిళలు భారీగా పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

డాక్టర్ మాట్లాడుతూ... ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు వైద్య పరీక్షలతోనే వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN