Narsapur: నర్సాపూర్‌లో కలకలం గుర్తు తెలియని రెండేళ్ల చిన్నారి లభ్యం!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ ఎల్‌ఐసీ ఆఫీస్ సమీపంలో కనిపించిన రెండేళ్ల గుర్తు తెలియని చిన్నారి.. తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి.
Narsapur: నర్సాపూర్‌లో కలకలం గుర్తు తెలియని రెండేళ్ల చిన్నారి లభ్యం!
Narsapur: నర్సాపూర్ పట్టణంలోని ఎల్‌ఐసీ ఆఫీస్ సమీపంలో సుమారు 2 సంవత్సరాల వయస్సున్న చిన్నారి కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు.
చిన్నారిని ఎవరైనా గుర్తించినా.. లేదా చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, పరిచయస్తులకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
చిన్నారి తల్లిదండ్రులను గుర్తించేందుకు ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలియగానే నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్ రెడ్డికి లేదా నర్సాపూర్ పోలీసులకి సమాచారం ఇవ్వాలని కోరారు.




