Medak: మెదక్‌లో ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై పోలీసుల స్పష్టత!
Medak: మెదక్ పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణమని విచారణలో నిర్ధారణ అయినట్లు టౌన్ సీఐ మహేష్ తెలిపారు.
Medak: మెదక్‌లో ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై పోలీసుల స్పష్టత!
మెదక్, అక్టోబర్ 13: మెదక్ పట్టణంలోని వెల్‌కమ్ బోర్డు వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణమని విచారణలో వెల్లడైనట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో కోతులు విగ్రహాన్ని పట్టుకొని ఊగడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
విగ్రహం దెబ్బతిన్న విషయం తెలియగానే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు, ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు మహిళల నుంచి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణమని నిర్ధారణకు వచ్చినట్లు ఇన్‌స్పెక్టర్ మహేష్ వెల్లడించారు.




