Toopran: తూప్రాన్ మండలం రావెల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావెల్లి గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు.
Toopran: తూప్రాన్ మండలం రావెల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత!
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 235, ప్రభుత్వ భూమి(గీత రెడ్డి కాలనీ ప్రభుత్వ పాఠశాల పక్కన )లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం చంద్ర శేఖర్ రెడ్డి తహసీల్దార్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనల మేరకు శిక్షలు విధించబడతాయనిఅయన హెచ్చరించారు.
తూప్రాన్ మండల పరిధిలోని ఏ గ్రామంలోనూ ప్రభుత్వ భూములను ఆక్రమించడం లేదా వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇట్టి అక్రమ నిర్మాణం తొలగించడంలో గిర్ధవర్ తూప్రాన్ తో పాటు జిపిఓ లు నాగరాజు, బాబు మరియు రమేష్ లు పాల్గొన్నారు.




