Medak: పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ సంబురాలు: మహిళల సందడి!
Medak: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Medak: పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ సంబురాలు: మహిళల సందడి!
మెదక్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు తూప్రాన్ మున్సిపాలిటీలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ సమత కాశిరెడ్డి మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
పెద్ద చెరువు కట్టపై డిస్కో లైటింగ్, డీజే సౌండ్, బతుకమ్మ ఘట్లకు కలర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సందడి చేశారు. రంగు రంగుల పూల కోసం ఉదయం గునుగు తంగేడు బంతి చామంతి గుమ్మడి ఆకుల పోగుచేసుకొని బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ... సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ అని, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైపాల్ రాథోడ్, రాములు, ప్రియాంక, నాగేష్, ఏర్పల లక్ష్మణ్, మహిళలు, వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.




