Toopran: సూపర్ ఎల్ నినోను ఐక్యంగా జయిద్దాం: చైర్‌పర్సన్ రజని!
Toopran: సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఐక్యమత్యంతో ఎదుర్కోవాలని, నీరు, డబ్బులను పొదుపుగా వాడుకోవాలని తూప్రాన్ మున్సిపల్ చైర్‌పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ పిలుపునిచ్చారు.
Toopran: సూపర్ ఎల్ నినోను ఐక్యంగా జయిద్దాం: చైర్‌పర్సన్ రజని!
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ చైర్ పర్సన్ మీడియా తో మాట్లాడుతూ రైతులు, యువత, మహిళలు నీటిని, డబ్బును పొదుపుగా వాడాలి - తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ సూపర్ ఎల్ నినో ప్రభావం నుండి ఐక్యమత్యంతో బయటపడాలని తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ కోరారు.
చైర్ పర్సన్ బొంది రజని మాట్లాడుతూ... భయంకరమైన కరోనానే మనం ఐక్యంగా జయించామని, అలాగే సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని కూడా జయించవచ్చన్నారు. రైతులు, యువత, మహిళలు డబ్బును, నీటిని తక్కువగా ఖర్చు చేయాలని సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలి, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి, వ్యవసాయంలో నీటి పొదుపు పద్ధతులు పాటించాలి- ప్రభుత్వ సూచనలు పాటించాలి, అందరూ అప్రమత్తంగా ఉండి, పరస్పర సహకారంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని పిలుపునిచ్చారు.




