Medak: నవరాత్రుల్లో అమ్మను పూజిస్తే శుభాలు: రాజేశ్వర్ శర్మ!
Medak: మెదక్ జిల్లా తూప్రాన్ దేవి గార్డెన్లో లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మవారు. నవరాత్రుల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పూజారి రాజేశ్వర్ శర్మ తెలిపారు.
Medak: నవరాత్రుల్లో అమ్మను పూజిస్తే శుభాలు: రాజేశ్వర్ శర్మ!
మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ దేవి గార్డెన్ లో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి వ్యవస్థాపకులు, పూజారి శలక రాజేశ్వర్ శర్మ మాట్లాడుతూ దేవి నవరాత్రులలో అమ్మవారిని నిష్టతో పూజిస్తే సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన తెలిపారు.
నవరాత్రులలో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులను అనుగ్రహిస్తుందని, ముఖ్యంగా లలిత త్రిపుర సుందరి దేవిని పూజిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతుందనిరాజేశ్వర్ శర్మ పేర్కొన్నారు. భక్తుల సహకారంతో 9 రోజుల పాటు చండి హోమం, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పూజారి కోరారు. ఈరోజు ఉదయం నుండి చండి హోమం, కుంకుమార్చన, హారతి, భక్తి పాటల అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.




