Toopran: తూప్రాన్‌లో ఇటుక బట్టీల కాలుష్యంపై విచారణ చేపట్టాలి!
Toopran: తూప్రాన్ మున్సిపాలిటీలో ఇటుక బట్టీల కాలుష్యంతో ప్రజలు, విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని, సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నేత మహేశ్ యాదవ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Toopran: తూప్రాన్‌లో ఇటుక బట్టీల కాలుష్యంపై విచారణ చేపట్టాలి!
తూప్రాన్: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లబోయిన మహేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న పొగ పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా సమీపంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యపై సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ ను కలిసి అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.
ఇటుక బట్టీల నిర్వహణకు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటిస్తున్నారా? పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.
ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి నిర్వహణ నిలిపివేయాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్య సమస్యపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.




