Medak: కౌడిపల్లిలో పట్టపగలే దొంగతనానికి యత్నం.. దొంగకు దేహశుద్ధి!
Medak: మెదక్ జిల్లా కౌడిపల్లిలో పట్టపగలే దొంగతనానికి యత్నం. బీరువా పగలగొడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు.. పోలీసులకు అప్పగింత.
Medak: కౌడిపల్లిలో పట్టపగలే దొంగతనానికి యత్నం.. దొంగకు దేహశుద్ధి!
Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో పట్టపగలే దొంగతనానికి యత్నించిన ఓ దొంగను స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన కుటుంబాన్ని గమనించిన దొంగ. ఇదే అదునుగా భావించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన నిందితుడు బీరువా తాళం కూడా పగలగొట్టి చోరీకి ప్రయత్నించాడు.
వివరాల్లోకి వెళ్తే కౌడిపల్లి మండల కేంద్రo లోని మల్లికార్జున కాలనీ కి చెందిన బుర్జీగాడి బుమయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఓ దొంగ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం బీరువాను పగలగొట్టి అందులోని వస్తువులు, నగదు, ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో బుమయ్య కుమారుడు గోపాల్ ఇంటికి చేరుకున్నాడు.
ఇంట్లో అనుమానాస్పదంగా శబ్దాలు రావడంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తాళం పగలగొడుతున్న దొంగ కనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన గోపాల్ చుట్టుపక్కల వారిని పిలవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని దొంగను పట్టుకున్నారు.
అనంతరం ఆగ్రహానికి గురైన స్థానికులు దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, పట్టుబడిన దొంగ గతంలో మరెక్కడైనా చోరీలకు పాల్పడి ఉండవచ్చని, అతని వద్ద కొన్ని ఆభరణాలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు విచారణ చేపడితే మరిన్ని దొంగతనాల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కౌడిపల్లి మండల కేంద్రంలో చోరీలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.




