Narsapur: నర్సాపూర్‌లో ఉద్రిక్తత ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద హారన్ వివాదంతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, స్థానికులపై దాడి జరగడంతో ఉద్రిక్తత నెలకొని లాఠీచార్జ్ జరిగింది.

G Ashok Reddy, Narsapur
Published on: 29 Nov 2026 4:08 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ఉద్రిక్తత ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.

సంగారెడ్డి వైపు నుంచి గజ్వేల్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకోగా.. బస్సు హారన్ కొట్టిన విషయంపై వివాదం తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు, కౌన్సిలర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం మరింత ఉద్రిక్తంగా మారింది. కౌన్సిలర్‌తో పాటు స్థానికులపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. అసలు బస్సు హారన్ కొట్టిన విషయంలోనే దాడి జరిగిందా? దాడికి పాల్పడిన వారెవరు? ఆర్టీసీ సిబ్బందితో పాటు స్థానికులపై దాడికి కారణాలేంటి? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur