Medak: కిష్టాపూర్ గ్రామంలో కుల వివక్ష సమస్య పరిష్కారానికి తహసీల్దార్ సమావేశం

Medak: కిష్టాపూర్ గ్రామంలో కుల వివక్ష సమస్యపై తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరువర్గాలతో సమావేశం. సామాజిక సామరస్యంపై గ్రామస్తులకు అవగాహన.

RAJU,TOOPRAN
Published on: 23 Oct 2026 7:35 PM IST
Medak
X

Medak: కిష్టాపూర్ గ్రామంలో కుల వివక్ష సమస్య పరిష్కారానికి తహసీల్దార్ సమావేశం

మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో నెలకొన్న కుల వివక్షకు సంబంధించిన సమస్యపై ఇరువర్గాల వారితో తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయని, కులం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదని స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో, స్వేచ్ఛగా కలిసి మెలిసి జీవించాలని, గ్రామంలో సామాజిక సామరస్యాన్ని కాపాడాలని సూచించారు.

అలాగే, కుల వివక్ష వల్ల సమాజంలో కలిగే నష్టాలను, ఐకమత్యంతో కలిసి జీవించడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్తులకు ఆయన వివరించారు. వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టపరమైన రక్షణల గురించి అవగాహన కల్పించారు. అదే సమయంలో, ఎలాంటి వివాదాలనైనా చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, తప్పుడు ఫిర్యాదులు లేదా అనవసరమైన కేసులకు దూరంగా ఉండాలని సూచించారు.

అధికారులు ఇరువర్గాల అభిప్రాయాలను తెలుసుకొని, పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ , ఎంపీడీవో పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN