Medak: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 24వ విడత డబ్బులు జమ!
Medak: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 24వ విడత రూ.2,000 జమ. ప్రధాని మోదీ నిధులు విడుదల చేశారని తెలిపిన బీజేపీ నేత రాంమోహన్ గౌడ్.
Medak: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 24వ విడత డబ్బులు జమ!
Medak: రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యాయని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు వరగంటి రాంమోహన్ గౌడ్ తెలిపారు.
శుక్రవారం రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిధులు విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు.
రాంమోహన్ గౌడ్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి పంటకు రూ. 2000 చొప్పున జమ చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటివరకు 24వ విడత డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాంమోహన్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు సాయి బాబా గౌడ్ AEO అబిలాష్ రైతులు పాల్గొన్నారు.




