Narsapur: మున్సిపల్ కార్యాలయంలో మహిళా సిబ్బంది బతుకమ్మ సంబరాలు!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్‌పర్సన్, కమిషనర్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 16 Oct 2026 6:42 PM IST
Narsapur
X

Narsapur: మున్సిపల్ కార్యాలయంలో మహిళా సిబ్బంది బతుకమ్మ సంబరాలు!

నర్సాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను పురస్కరించుకుని పురపాలక సంఘం కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మను అందంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులు బతుకమ్మ చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ మన్నె నిరంజన్ దాస్, దుర్గప్ప గారి సరళ, ఎంపీడీవో, స్థానిక సబ్‌ఇన్‌స్పెక్టర్, మెప్మా సీఈఓ దేవపాల, మున్సిపల్ మేనేజర్ వైట్ల మధుసూదన్, టౌన్ ప్లానింగ్ అధికారిణి స్రవంతి, మున్సిపల్ సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR