Narsapur: రోడ్డు ప్రమాదంలో మెదక్ ఏఆర్‌ఎస్‌ఐ నీలి ప్రసాద్ మృతి!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఆర్‌ఎస్‌ఐ నీలి ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 19 Oct 2026 5:55 PM IST
Narsapur
X

Narsapur: రోడ్డు ప్రమాదంలో మెదక్ ఏఆర్‌ఎస్‌ఐ నీలి ప్రసాద్ మృతి!

నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెదక్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో సహాయ రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీలి ప్రసాద్ (57) చికిత్స పొందుతూ మృతి చెందారు. విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన తీరు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు నీలి ప్రసాద్ తన నివాసం నుంచి మెదక్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయానికి విధులకు హాజరయ్యేందుకు పల్సర్ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామ శివారులోని జల హనుమాన్ ఆలయం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

ఎదురుగా వేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నీలి ప్రసాద్ కుడి భుజం, ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స పొందుతూ మృతి..

ప్రమాద సమాచారం అందుకున్న నర్సాపూర్ పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన నీలి ప్రసాద్‌ను అంబులెన్స్‌లో నర్సాపూర్‌లోని కేకే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు కొండాపూర్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 17 నిమిషాలకు నీలి ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు..

మృతుడి కుమారుడు నీలి శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ. రంజిత్ కుమార్ తెలిపారు. విధులకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోవడం తో విషాదo అలుముకోంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR