Medak: మెదక్‌లో సొంత ఖర్చులతో చాకలి ఐలమ్మ నూతన విగ్రహం!

Medak: మెదక్‌లో కోతుల దాడితో దెబ్బతిన్న చాకలి ఐలమ్మ విగ్రహం స్థానంలో సొంత ఖర్చులతో నూతన విగ్రహం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటించారు.

NAGARAJ, MEDAK
Published on: 14 Oct 2026 10:57 AM IST
Medak
X

Medak: మెదక్‌లో సొంత ఖర్చులతో చాకలి ఐలమ్మ నూతన విగ్రహం!

Medak: మెదక్ పట్టణంలోని వెల్‌కమ్ బోర్డు సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతిన్న ఘటనలో కోతుల వల్లే నష్టం దురదృష్టకరమని మెదక్ ఎమ్మెల్యే మైనoపల్లి రోహిత్ ఉన్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ , వీరనారి చాకలి ఐలమ్మకు మరింత గౌరవప్రదంగా తన సొంత ఖర్చులతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మెదక్ పట్టణంలో సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. విగ్రహాలు, ప్రజా ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై రాజకీయ ఆరోపణలకు తావివ్వకుండా, పోలీసుల విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా నిర్ణయాలకు రావాలని ఆయన వర్గీయులు పేర్కొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK