Medak: రంగాయిపల్లి, రామాయపల్లి విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ!

Medak: మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, రామాయపల్లి పాఠశాలల్లో విద్యా ఆరోగ్యం పథకంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.

RAJU,TOOPRAN
Published on: 9 Nov 2026 7:13 PM IST
Medak
X

Medak: రంగాయిపల్లి, రామాయపల్లి విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ!

మెదక్: మనోహరాబాద్ మండలంలో విద్యా ఆరోగ్యం పథకం ద్వారా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేశారు. జిల్లా వైద్యాధికారి జన్నేశ్వర్ ఆదేశాల మేరకు రంగాయిపల్లి, రామాయపల్లి రెండు పాఠశాలల్లో కంటి వైద్యులు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినట్లు కంటి వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ... చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తే చదువులో వెనుకబడకుండా ఉంటారని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN