Medak: బతుకమ్మ వేళ ఘర్షణ: దళిత సర్పంచ్‌పై దాడి, ఆరుగురిపై కేసు!
Medak: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొన్నాయిపల్లిలో బతుకమ్మ వేడుకల వేళ దళిత సర్పంచ్‌పై దాడి జరిగింది. ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి తూప్రాన్ డీఎస్పీ విచారించారు.
Medak: బతుకమ్మ వేళ ఘర్షణ: దళిత సర్పంచ్‌పై దాడి, ఆరుగురిపై కేసు!
మెదక్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం కొన్నాయి పల్లి (పిటి)గ్రామల లో బతుకమ్మ పండుగ రోజు దళిత సర్పంచ్ చిత్ర రఘు ఉప సర్పంచ్ ఆంజనేయులు వర్గల మద్య కొన్నాయి పల్లి లో సర్పంచ్ దళితుల డప్పు కొట్టడం విషయం లో జరిగిన గొడవల పై తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ విచారణ చేపట్టారు.
దళిత సర్పంచ్ చిత్ర రఘు పిర్యాదు చేయగా 6 గురిపై SC &ST కేసు నమోదు అయింది దళిత సర్పంచ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ వద్ద కాకుండా మరో చోట బతుకమ్మ అడటానికి వెళ్లడం తో సర్పంచ్ ఇక్కడే ఆడాలంటూ కోరడం తో అతని చొక్క పట్టుకొని తోపులట జరిగింది కొట్టడం తో పాటు దళితుడిని అనే ఉద్దేశం తో కించపరిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
డిఎస్పీ నరేందర్ గౌడ్ ఇరువర్గాల తో విడి విడిగా విచారణ చెప్పటారు గ్రామ సర్పంచ్ పాలక వర్గం కలిసిమెలిసి ఉన్నడాలని గొడవల తో జీవితాలు కోర్టు ల చుట్టూ తీరగాల్సివాస్తుందని డిఎస్పీ సూచించారు రెండు గ్రామాల లో SC ST కెసులు నమోదు చేశారు.
ఈ విచారణ లో మనోహరాబాద్ ఎసై సుభాష్ గౌడ్ రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు సామల అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లో దళితుల పై దాడులు పెరుగుతున్నాయని దాడులు చేసిన అందరి పై SC. ST కెసులు నమోదు చేయాలి వెంటనే అరెస్టు లు చేసి రిమాండ్ చేయాలనీ డిమాండ్ చేశారు.
జిల్లా కాంగ్రెస్ SC సెల్ అధ్యక్షులు మహేందర్ మాట్లాడుతు.... దాడులకు పాలు పడ్డ సర్పంచ్ లను ఉపసర్పంచ్ లను అరెస్టు చేసి పదవుల నుండి తొలిగించాలని కోరారు పోలీసులు చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉశృతం చేస్తాం అని హెచ్చరించారు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.




