Medak: పెట్రోల్ అయిపోయిందని బైక్‌ను తగలబెట్టిన యువకులు!

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ గేట్ వద్ద పెట్రోల్ అయిపోయిందని సరదాగా మజాక్ చేస్తూ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 6 Nov 2026 7:03 PM IST
Medak
X

Medak: పెట్రోల్ అయిపోయిందని బైక్‌ను తగలబెట్టిన యువకులు!

మెదక్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ గేట్ సమీపంలో వింత ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ అయిపోయిందనే కారణంతో యువకులు బైక్‌ను తగలబెట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు రెండు బైక్‌లపై ఏడుపాయల దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఇద్దరు ఒక బైక్‌పై, మరో ఇద్దరు ఇంకో బైక్‌పై వెళ్తున్నారు.

ఈ క్రమంలో వెనుక వస్తున్న బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో ముందుగా వెళ్తున్న తమ స్నేహితులకు ఫోన్ చేసి పెట్రోల్ తీసుకురావాలని కోరినట్లు సమాచారం. అయితే, ఈ క్రమంలో యువకులు సరదాగా మజాక్ చేస్తూ బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో బైక్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. సరదాగా చేసిన పని చివరకు బైక్ కాలిపోయే పరిస్థితికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యువకులు చేసిన ఈ నిర్లక్ష్యపు పనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR