Medak: కౌడిపల్లి నూతన ఎస్‌ఐగా నీరేష్ బాధ్యతల స్వీకరణ!

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి నూతన ఎస్‌ఐగా నీరేష్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 4 Nov 2026 9:09 PM IST
Medak
X

Medak: కౌడిపల్లి నూతన ఎస్‌ఐగా నీరేష్ బాధ్యతల స్వీకరణ!

మెదక్: మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా నీరేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో గతంలో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన అమర్ జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నీరేష్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

అలాగే నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించేలా అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్‌ఐ నీరేష్‌కు ఎస్పీ సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR