Medak: గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎర్వ శ్రీనివాస్ ఎన్నిక
Medak: మెదక్ జిల్లా గంగపుత్ర సంఘం నూతన అధ్యక్షుడిగా స్టేషన్ మాసాయిపేట్ సర్పంచ్ ఎర్వ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Medak: గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎర్వ శ్రీనివాస్ ఎన్నిక
మెదక్: తెలంగాణ గంగపుత్ర సంఘం మెదక్ జిల్లా సమావేశం ఈ నెల 17వ తేదీన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు నూతనంగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన మెదక్ జిల్లా గంగపుత్ర సంఘం కార్యవర్గం:
1. అధ్యక్షులు: శ్రీ ఎర్వ శ్రీనివాస్ - స్టేషన్ మాసాయిపేట్ సర్పంచ్
2. ప్రధాన కార్యదర్శి: శ్రీ కుంట లక్ష్మణ్
3. కోశాధికారి: బండారి బిక్షపతి
4. కార్యనిర్వాహక అధ్యక్షులు: బండారి సాయినాథ్
5. మహిళా మోర్చా అధ్యక్షురాలు: మంద స్వాతి
ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఇల్లం రాజకుమార్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ దాసరి మోహన్, శ్రీ కాసెం జగన్, అధికార ప్రతినిధి శ్రీ పాక మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దీటి మల్లయ్య మాట్లాడుతూ... గంగపుత్ర కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న 3 నెలల్లో జిల్లా సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, సర్వే తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
నూతన అధ్యక్షులు ఎర్వ శ్రీనివాస్ మాట్లాడుతూ... తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మెదక్ జిల్లాలో గంగపుత్ర సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రతినిధులు, గడప దేవేందర్ తదితరులు అభినందించారు.




