Medak: ఎమ్మెల్యే రోహిత్‌రావుపై అసత్య ప్రచారం: పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
Medak: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Medak: ఎమ్మెల్యే రోహిత్‌రావుపై అసత్య ప్రచారం: పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
మెదక్: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుపై సోషల్ మీడియా, మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మెదక్ పట్టణ, రూరల్ పోలీస్‌స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ దొంతి నరేష్‌గౌడ్, కాంగ్రెస్ నేత భూపతిరాజు గంగాధర్ ఆధ్వర్యంలో నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు, అసభ్యకర పోస్టులు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యేపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో రాగి అశోక్, అవార శేఖర్, గోదల సాయి, నవీన్‌కుమార్, మస్కూర్ సంతోష్, బాలరాజ్, నవీన్, సున్నం నరేష్ తదితరులు పాల్గొన్నారు.




