Medak: నవంబర్ 1 ‘చలో ఢిల్లీ’ని విజయవంతం చేయండి: కాంగ్రెస్ పిలుపు!

Medak: కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న నిర్వహించే ‘చలో ఢిల్లీ’ని విజయవంతం చేయాలని మెదక్ కాంగ్రెస్ నాయకులు సరల్ పటేల్, ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు.

NAGARAJ, MEDAK
Published on: 25 Oct 2026 6:33 PM IST
Medak
X

Medak: నవంబర్ 1 ‘చలో ఢిల్లీ’ని విజయవంతం చేయండి: కాంగ్రెస్ పిలుపు!

మెదక్ అక్టోబర్ 24: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఎస్ ఐ ఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి మెదక్ జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి రావాలని చలో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరుగు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి రావాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, పిలుపునిచ్చారు.

ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సరల్ పటేల్ మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతోందని తెలిపారు.

ఇందులో భాగంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 15 లక్షల మంది ఓటర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో నవంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో ముందుకు సాగి, ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కుమార్

​రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, ​జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, ​​దుబ్బాక ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి.మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK