Medak: ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్!

Medak: వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఫామ్ పాండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. పాపన్నపేటలో ఉపాధి పనులను పరిశీలించారు.

NAGARAJ, MEDAK
Published on: 17 Oct 2026 4:03 PM IST
Medak
X

Medak: ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్!

మెదక్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు, పంటల సాగుకు నీటి కొరత లేకుండా ఫామ్ పాండ్ల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

శనివారం పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో వీబీ–జీ రామ్ జీ పథకం కింద చేపడుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఫామ్ పాండ్లు, సామూహిక ఇంకుడు గుంతలు, జలసిరి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఫామ్ పాండ్ల నిర్మాణ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో ఫామ్ పాండ్లను నిర్మించాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు ఫామ్ పాండ్లను ఎంపిక చేసి, వాటి నిర్మాణ పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.పనులకు ప్రతిరోజూ హాజరవుతున్న కూలీల సంఖ్య, వారికి చెల్లిస్తున్న కూలి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరును తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.

గ్రామాల్లో భూగర్భ జలమట్టాలను పెంచేందుకు, వర్షపు నీటిని సంరక్షించేందుకు అవసరమైన పనులను గుర్తించి వీబీ–జీ రామ్ జీ పథకం కింద చేపట్టాలని కలెక్టర్ సూచించారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నీటి సంరక్షణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాసరావు, ఎంపీడీవో విష్ణువర్ధన్, తహసీల్దార్ సతీష్, గ్రామ మాజీ సర్పంచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK