Medak: ఇందిరమ్మ ఇంట్లో దీపావళి: కలెక్టర్ ప్రతిమా సింగ్ సందడి

Medak: కుల్చారం మండలం కిష్టాపూర్‌లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులతో కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వేడుకల్లో పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK
Published on: 8 Nov 2026 7:01 PM IST
Medak
X

Medak: ఇందిరమ్మ ఇంట్లో దీపావళి: కలెక్టర్ ప్రతిమా సింగ్ సందడి

మెదక్: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ప్రభుత్వం నిర్వహిస్తున్న మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదివారం కుల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో జురు లత, సంతోష్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ సందర్శించి, వారితో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల నూతన గృహాల్లో దీపాల వెలుగులు నింపడం ఆనందంగా ఉందన్నారు.

ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు.కొత్త ఇళ్లలో అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబాల జీవితాల్లో దీపావళి కాంతులు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని నింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

అలాగే ఇందిరమ్మ ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారులందరూ తమ నూతన గృహాల్లో దీపావళి సంబరాల ఫొటోలను సెల్‌ఫోన్లలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని పంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, గ్రామ సర్పంచ్ స్వప్న ఊసయ్య తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK